చిన్నారులకు కోవిడ్ టీకా వచ్చేసింది..!

Kovaggin clears line for pediatric vaccine

0
132

భారత్ బయోటెక్ చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు విషయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

2-18 ఏళ్ల మధ్య వయసు వారికి ఇచ్చే ఈ టీకాకు అత్యవసర అనుమతులు జారీ చేయాలని సూచించింది. కొన్ని షరతుల మేరకు ఈ టీకా వినియోగించవచ్చని కమిటీ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్.. 2-18 ఏళ్ల మధ్య పిల్లల కోసం కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. రెండు, మూడు దశల ట్రయల్స్  సైతం పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటాను కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థకు సమర్పించింది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఈ నెల మొదట్లో దరఖాస్తు చేసుకుంది.