నెలసరి సమయంలో మహిళలు ఏ ఫుడ్ తినాలి ఏది తినకూడదు

నెలసరి సమయంలో మహిళలు ఏ ఫుడ్ తినాలి ఏది తినకూడదు

0
124

మహిళలకు నెలసరి సాధారణమైంది.. కాని ఈ సమయంలో కొందరికి చాలా అన్ ఈజీగా ఉంటుంది.. ఎలాంటి పని చేసుకోలేరు.. అయితే ఈ సమయంలో కొన్ని ఆహర పదార్దాలు తీసుకోవడం వల్ల కూడా శరీరం నీర్సంగా మారడానికి కారణం అవుతుంది అందుకే డాక్టర్ ఎలాంటి ఆహరం తీసుకోవాలో చెబుతున్నారు. మరి అది తెలుసుకుందాం.

మీకు నెలసరి సమయంలో ఈ ఐదు రోజుల్లో తలనొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపిస్తే అది తగ్గడానికి నీళ్లు బాగా తాగాలి. కనీసం రెండు నుంచి మూడు లీటర్లు తప్పనిసరిగా తీసుకోండి. పుచ్చ, కర్బూజా, కీరా, దానిమ్మ లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడదు. రక్తం బయటకు ఎక్కువగా పోతుంది కాబట్టి ఈ రక్తం బాగా పట్టే ఇనుము అంటే ఐరెన్ ఫుడ్ తీసుకోవాలి.

మరి ఐరన్ వచ్చే ఆహారం అంటే రోజూ ఆకుకూరలతో పాటు సెనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు లాంటి గింజలను తీసుకోవాలి.. అలాగే విటమిన్‌- సి అవసరం. విటమిన్‌ – సి అధికంగా లభించే అన్ని రకాల పండ్లు, నిమ్మరసం, పచ్చి కాప్సికమ్‌ తీసుకోండి. ఇది చాలా మంచిది ప్రొటీన్లు పుష్కలంగా లభించే చికెన్‌, చేప, గుడ్లు, అన్ని రకాల పప్పులు, సోయా గింజలు, పనీర్‌, మీల్‌ మేకర్‌ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ సమయంలో ఉప్పు పంచదార చాలా తక్కువగా తీసుకోండి.