ప్రెషర్ కుక్కర్‏లో రైస్ వండుతున్నారా ఈ విష‌యాలు తెలుసుకోండి

Learn These Things While Cooking Rice In A Pressure Cooker

0
72

ఇప్పుడు ఏ ఇంటిలో చూస్తున్నా ఇండక్షన్ స్టవ్, ఎలక్టిక్ కుక్కర్ ల వాడ‌కం బాగా పెరిగింది. ఇక వీటికి ముందు అంద‌రూ ప్రెషర్ కుక్కర్ వినియోగించేవారు. ఇప్పుడు ఈ ప్రెష‌ర్ కుక్క‌ర్లు కొంద‌రు మాత్ర‌మే వాడుతున్నారు. ఇక కొంద‌రు క‌ర్రీ చేయ‌డానికి ఇలాంటి వాటికి కూడా వాడుతున్నారు. ప్రెష‌ర్ కుక్క‌ర్లో అన్నం వండుతున్నారా అయితే కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.

ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే అది పిండిని ఎక్కువగా నిలుపుకుంటుంది. ఇలా వండిన అన్నం తింటే క‌డుపు నిండిన భావన క‌లుగుతుంది. ఇందులో అన్నం తింటే ఆక‌లి చాలా త‌క్కువ‌గా వేస్తుంది. ఈ కుక్క‌ర్ లో మీరు అన్నం వండితే చాలా వేగంగా అన్నం ఉడుకుతుంది జీర్ణ‌ప్ర‌క్రియ ఈజీగా జ‌రుగుతుంది.

ఇక వార్చిన దానిలో గంజి నుంచి పోష‌కాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి, కాని ఈ ప్రెష‌ర్ కుక్క‌ర్ లో పోషకాలు అన్నంలోనే ఉండిపోతాయి. ఇలా వండిన అన్నంలో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. అయితే కొంద‌రు శ‌రీరానికి వేడి చేస్తుంది అంటారు అలాంటి వారు ఈ ప్రెష‌ర్ కుక‌ర్క్ ఎల‌క్ట్రిక‌ల్ కుక్క‌ర్ లో వండిన రైస్ తిన‌క‌పోవ‌డం మేలు.