రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం(Lemon Juice) కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం రోజు ఉదయాన్ని నిమ్మరసం, తేనె కలుపుకుని గోరువెచ్చని నీరు తాగుతున్నారు. అయితే నిమ్మరసాన్ని పరగడుపునే కాదు భోజనం చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చని, ఇలా చేయడం కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా నిమ్మరసం కేవలం బరువు తగ్గడం కోసమే కాకుండా.. మరెన్నో ఆరోగ్య సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. భోజనం చేసిన తర్వాత గ్లాసుడు నీళ్లలో రెండు నిమ్మ చెక్కలు పిండుకుని ఆ నీళ్లు తాగితే అది మన శ్వాసను చాలా ఫ్రెష్‌గా ఉంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు. దాంతో పాటుగా నోరు పొరిబాడకుండా కూడా నిమ్మరసం కాపాడుతుందని, దాంతో పాటుగా నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్, కాల్షియం.. కిడ్నీ రాళ్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఇది ఉపశమనం కల్పిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
జీర్ణ ప్రక్రియ: భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తీసుకోవడం వల్ల మన జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ వేగంగా జరగడంలో కూడా నిమ్మరసం ఉపయోగపడుతుందని, దాంతో పాటుగా జీర్ణ సమస్యలను తగ్గించడంలో, రాకుండా చేయడంలో కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా గుండె, మెదడు, నరాల పనితీరును కూడా నిమ్మరసం మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ఇమ్యూనిటీ బూస్టర్: ఆహారం తర్వాత నిమ్మరసం తాగడం మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. నిమ్మకాయల్లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సహా మరిన్ని పోషకాలు ఇందులో కీలకంగా పనిచేస్తాయి. ఇవి శరీర పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా బాగా పనిచేస్తాయి. తిన్న తర్వాత నిమ్మరసం తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా రాకుండా నివారిస్తుంది. అదే విధంగా మన చర్మ ఆరోగ్యానికి కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యానికి కీలకమైన కొల్లాజెస్ ఉత్పత్తిని పెంచడంలో నిమ్మకాలు అద్భుతంగా పనిచేస్తాయి. మెరిసే చర్మం కోసం తిన్న తర్వాత నిమ్మరసం తాగొచ్చని నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి: శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా నిమ్మకాయల్లో ఉండే ఆమ్లాలు.. కడుపులో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నీళ్లు గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి ఉపశమనం కూడా కల్పిస్తుంది.
టాక్సిన్స్‌కు టెర్రర్: సాధారణంగా నిమ్మకాయ రసం ది బెస్ట్ డీటాక్స్‌గా చెప్తారు. రోజూ నిమ్మరసం తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను, హానికరమైన కణాలను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. అదే విధంగా మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ భోజనం తర్వాత నిమ్మరసం(Lemon Juice) తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరుగిపోతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది.