తొలి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారో చూద్దాం

Let us see what is the Toli Ekadashi day

0
121

తొలి ఏకాదశి అనగానే హిందువుల తొలి పండుగ అని చెబుతారు. అందుకే ఇది పెద్ద పండుగగా చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ తొలిఏకాదశి రోజున దేవాలయానికి వెళతారు. కొందరు కొత్త బట్టలు కూడా ధరిస్తారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా గా పిలుస్తారు.

ఎందుకంటే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఇలా నాలుగు నెలలు ఇక్కడ ఆయన నిద్రస్తాడు.అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు.
అందుకే ఈ ఏకాదశి రోజు నుంచి చాతుర్మాసాలుగా పిలుస్తారు. ఈ సమయంలో ఈ నాలుగు నెలలు దీక్షకూడా ఆచరిస్తారు దానిని చాతుర్మాసదీక్ష అంటారు.

ఈ రోజు ఆ స్వామిని కొలిచినా, పేదలకు సాయం చేసినా, లేని వారికి అభాగ్యులకి తోచిన సాయం చేసినా, ఎంతో పుణ్యం. పెద్దలను చాలా మంది నేడు తలచుకుని వారి పేరుమీద దాన ధర్మాలు చేస్తారు. గోవులని పూజిస్తారు. అంతేకాకుండా నేడు ఏకాదశి వ్రతం కూడా ఆచిరిస్తారు.