పప్పు నెయ్యి ఆవకాయ ఆ కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక స్వీట్స్ లో కూడా నెయ్యి ఎక్కువగా వాడతాం. ఇన్న పిల్లలకు కూడా నేతితో ఫుడ్ పెడతాం. ఇలా నెయ్యి మనలో చాలా మంది ఇళ్లల్లో తింటూ ఉంటారు. అయితే నెయ్యి తింటే కలిగే లాభాలు ఏమిటి దాని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం.
నెయ్యి పిల్లలు, వృద్ధులకు మంచిది. చిన్న పిల్లల ఎత్తు, మానసిక వికాసాన్ని పెంచడంలో నెయ్యి సహాయపడుతుంది. ఇక ఎముకలు బలంగా అవ్వాలంటే నెయ్యి తినాల్సిందే. ఇక నేతిని ఎక్కువగా తీసుకుంటే ఊబకాయ సమస్య వస్తుంది. అలాగే కడుపు నొప్పి రావచ్చు మితంగా తీసుకోవాలి.
పప్పు, రైస్ తింటున్నప్పుడు నెయ్యిని తక్కువగా వాడండి అంటున్నారు వైద్యులు. ఈ విషయం గుర్తు ఉంచుకోవాలి. పిల్లల ఆహారంలో రెండు చెంచాల నెయ్యిని ఉపయోగించడం వల్ల వారి ఎదుగుదల, మానసిక వికాసం పెరుగుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ అలాగే డి పుష్కలంగా ఉన్నాయి. ఒమేగా -3 లు, లినోలెయిక్ ఆమ్లం, బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవు లేదా గేదె పాలతో తీసిన నెయ్యిని వాడవచ్చు. ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడితే మంచిది.
గమనిక – ఏ ఫుడ్ అయినా అధికంగా తీసుకోకూడదు. ఇక్కడ మీరు నెయ్యి కూడా మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి.