నిండు ప్రాణాన్ని బలితీసుకున్న పేను కాటు..

0
91

ఇంతవరకు మనము ఎక్కడ వినని విచిత్ర ఘటన USలోని మైనేలో చోటుచేసుకుంది. పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తోస్తుందని అందరికి తెలిసిందే. దీనికి గల కారణం అలర్జీ అని వైద్యులు చెప్తుంటే వింటుంటాము.

కానీ USలోని మైనేలో ఒక వ్యక్తి పేను కాటుతో మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది. పేను కరిచిన అనంతరం అతడికి అరుదైన పొవాసాన్ వైరస్ సోకింది. దాంతో నెమ్మదిగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. కానీ ఈ వైరస్ నివారించడానికి పరిష్కారం లేకపోవడంతో ఆ వ్యక్తి మరణించాడు.

ఇంకా ఈ వైరస్ నివారణకు ఎలాంటి  చికిత్స లేదని అలాగే  వ్యాక్సిన్ కూడా లేదని అక్కడి వైద్యులు తెలిపారు. అందుకే ఎవ్వరైనా పెను కాటుకు గురైతే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పేను కాటుకు గురికాకుండా జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.