దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ తాజాగా అన్నీ చోట్ల కరోనా ఆంక్షలు సడలింపు ఇస్తున్నారు, బస్సులు రైళ్లు అన్నీ తిరుగుతున్నాయి. ఓ పక్క షాపులు తీస్తున్నారు. అయితే అన్నీ స్టేట్స్ లో తగ్గుతుంటే మరో రాష్ట్రంలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు కేరళలో జికా వైరస్ వణికిస్తుండగా, మరోవైపు రోజువారీ కొత్త కరోనా కేసులు వేలసంఖ్యలో నమోదవుతున్నాయి.
ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వస్తున్న కేసుల్లో కేరళలో 30 శాతం కేసులు నమోదు అవుతున్నాయి.
దీంతో కేరళ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. అది కూడా జూలై 17, జూలై 18 తేదీల్లో వారంతపు లాక్డౌన్ విధించింది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
జూలై 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ కొత్త రూల్స్ అమలులులోకి వస్తాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు ఆధారంగా A, B, C, D కేటగిరీలుగా విభజించింది. ఇక ఈ కేటగిరీల ప్రకారం A,B,C కేటగిరీ ప్రాంతాల్లో షాపులు రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటాయి. బ్యాంకులు ఐదు రోజుల పనిదినాలు ఉంటాయి ప్రజలు వెళ్లవచ్చు. ఈ రెండు రోజులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తారు.