తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఒకసారి లాక్ డౌన్ పెట్టామని మళ్లీ లాక్ డౌన్ కు ఛాన్స్ లేదన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, అందరూ మాస్కులు వాడాలని కోరారు. ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. జనవరి చివరివారం నుంచి లాక్డౌన్ పెడతారన్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు.