ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే మనందరికీ అరటిపువ్వు లాభాలు తెలియక ఎక్కువగా ఉపయోగించము. కానీ ఒక్కసారి ఈ లాభాలు తెలిస్తే మళ్ళి జీవితంలో రోజు అరటిపువ్వు ఉపయోగిస్తారు.
ప్రస్తుతం వచ్చే వ్యాధులకు ఎన్ని రకాల మందులు వదిన సరే మంచి ఫలితాలు మాత్రం లభించడం లేవు. కావున ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టాలంటే అరటిపువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అరటిపువ్వును రోజు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోవడంతో పాటు..జీర్ణ క్రియ మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాహారాలు ఉండడం వల్ల ఆరోగ్య పరంగా అద్భుతమైన లాభాలు పొందవచ్చు. అరటిపువ్వులో ఉంటే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఈ పువ్వును తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావాన్ని అరికట్టుతుంది. అందుకే ఇన్ని లాభాలు ఉన్న పువ్వును తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.