సమ్మర్ లో డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే బోలెడు ప్రయోజనాలు..

0
105

ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండనుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాలంలో తీసుకునే ఆహారంపైన, డ్రింక్స్ పైన  ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది.

ముఖ్యంగా వేసవిలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉదంటున్నారు నిపుణులు.కానీ వేసవిలో డ్రై ఫ్రూట్స్ ప్రభావం చాలా వేడిగా  ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎండాకాలంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇలా తీసుకోవడం వలన వేడి పెరగదు. ఇక ఆలస్యం ఎందుకు వేసవిలో ఏ డ్రై ఫ్రూట్‌ని ఎలా తినాలో చూసేద్దాం.

ఎండుద్రాక్ష: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మార్కెట్‌లో అనేక రకాల ఎండుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి.అన్ని రకాల ఎండుద్రాక్షల రుచి వేడిగా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఎప్పుడూ తినండి.

అత్తి పండ్లు : ఎండిన అత్తి పండ్లను చలికాలంలో మాత్రమే తినాలని చాలా మంది నమ్ముతారు. కానీ మీకు కావాలంటే, మీరు వేసవిలో కూడా అత్తి పండ్లను తినవచ్చు. ఇందుకోసం తినే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. 1-2 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచండి. ఉదయం నిద్ర లేవగానే వీటిని తినాలి.

బాదం:

బాదంపప్పు చాలా వేడిగా ఉంటుంది. చలికాలంలో బాదంపప్పు ఎక్కువగా తీసుకోవడానికి ఇదే కారణం. మీరు వేసవిలో బాదంపప్పును తినాలనుకుంటే, దానిని నానబెట్టి తినండి. బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి, బాదంపప్పు తొక్క తీసి ఉదయాన్నే తినాలి.

వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ మార్పులు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది