కర్పూరంతో బోలెడు ప్రయోజనాలు..అవి ఏంటంటే?

lots-of-benefits-with-camphor

0
91

కర్పూరం దేవుడికి హారతి ఇచ్చేందుకు వాడే ఓ పదార్థం. పూజ సామగ్రిలో ప్రతి ఇంట తప్పనిసరిగా ఈ కర్పూరం ఉంటుంది. పూజ క్రతువులో వాడే కర్పూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనిమీకు తెలుసా..? కర్పూరంతో మీరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మనకు ఉపశమనం కలిగించే వివిధ రకాల ప్రయోజనాలెన్నో కర్పూరంలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. విక్స్‌, ఆవిరి, దగ్గు సిరప్‌లు, బిళ్లల తయారీలోనూ కర్పూరం వాడుతారట. సాధారణ జలుబుకు కర్పూరం దివ్వ ఔషధం. జలుబు సమయంలో కాస్త కర్పూరం ఆయిల్‌ను ఛాతీ, విపుపై రాయడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.

జుట్టు రాలడాన్ని కూడా కర్పూరం తగ్గిస్తుందట. సాధారణ హెయిర్ ఆయిల్‌లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను కలిసి మర్దన చేస్తే తలలో రక్త ప్రసరణను పెరిగి, జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

అలాగే తలలో పేనుల నివారణకు కర్పూరం ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం కలిపి జుట్టుకు పట్టించి..ఆపై షాంపూతో శుభ్రం చేసుకుంటే పేనుల సమస్య తగ్గుతుంది. మరి ముఖ్యంగా రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్య. అయితే, పడుకునే ముందు కొన్ని కర్పూరం చుక్కలను బెడ్‌, తలదిండుపై వెదజల్లితే చక్కటి నిద్ర పడుతుందన్నది నిపుణులు సూచిస్తున్నారు.