నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత ఎక్కువ దూరం నడిస్తే మంచిది అని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి చిన్న పనికి వాహనాలను వాడుతుంటాం. దీనితో నడకకు దూరమై రోగాలకు దగ్గర అవుతున్నాం. ఇప్పుడు ఉన్న రోజుల్లో కొంతమంది నడవడమే మానేశారు. నడకకు మించిన వ్యాయామం లేందంటున్నారు నిపుణులు. ఇప్పుడు మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఉత్సాహంగా ఉంటాము.
అంతేకాదు మన కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇలా నడవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండవచ్చు.
చెప్పులు లేకుండా నడవటం వలన మన పాదాల్లో ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతుంది. దీని వల్ల శరీరం మొత్తానికీ హెల్ప్ అవుతుంది.
అయితే, చెప్పులు లేకుండా నడవడం వలన జలుబు, దగ్గు వస్తాయనే ఒక అపోహ మాత్రం ఉంది. ఇది నిజం కాదు. జలుబు, దగ్గు రావటం, రాకపోవటం అనేది మీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంది కానీ చెప్పులు లేకుండా నడవడం మీద కాదు. కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొంత సమయం నడవడానికి తప్పకుండ కేటాయించండి. మెరుగైన ఆరోగ్యాన్ని పొందండి.