ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అనే సామెతను మనం తరచూ వింటుంటాం. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల అలా ఉంటాయి మరి. ఉల్లిని ప్రతి ఒక్కరూ ఆహారంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లి లేకుండా కూర చేయడం మాత్రం అస్సలు జరిగే పనే కాదు. కానీ ఉల్లిపాయలు తినకుండా ప్లేట్‌లో పక్కన పెట్టేసేవారిని చాలా మందిని చూసే ఉంటాం. దానితో వారు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు దూరం అవుతున్నారు.
ఉల్లిపాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉల్లిపాయలు మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున మంటతో పోరాడుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందువల్ల ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. కావున క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. ఉల్లిపాయలోని గుణాలు రక్తం గడ్డకట్టకుండా, రక్త సంబంధిత సమస్యలను నివారిస్తాయి. దంతక్షయాన్ని, దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది.
పచ్చి ఉల్లిపాయని నమిలితే నోటిలో ఉండే కీటకాలు, జెర్మ్స్ నశించిపోతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నోప్పుల నుంచి ఉపశమనం కలిగించేలా చేస్తాయి. శరీరంలో వేడిని నియంత్రించి చలవ చేసేలా చేస్తుంది. ఉల్లిపాయ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గించి.. రక్తపోటును నివారిస్తుంది. ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఉల్లిపాయలను తినాలని సూచిస్తుంటారు నిపుణులు.