పీరియడ్స్ సమయంలో కరోనా టీకా వేసుకోవచ్చా?

పీరియడ్స్ సమయంలో కరోనా టీకా వేసుకోవచ్చా?

0
82

ఈ కరోనా దేశంలో విజృంభిస్తోంది, ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి..

వ్యాక్సినేషన్ ద్వారానే నిరోధించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మన దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

అయితే చాలా మంది ఇంకా ఈ కరోనా టీకాలపై అపోహల్లో ఉంటున్నారు, అయితే దీనిపై ప్రభుత్వం కూడా ఎంతో ఎడ్యుకేట్ చేస్తోంది, వైద్యులు కూడా చాలా మంది టీకా గురించి తెలియచేస్తున్నారు..

 

ముఖ్యంగా మహిళలకు సంబంధించి వ్యాక్సినేషన్పై ఎన్నో అపోహలు నెలకొంటున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పీరియడ్స్ టైంలో టీకా వద్దు అని ఓ వార్త వైరల్ అయింది… ఆ వార్తలు నమ్మవద్దు అని సీనియర్ వైద్యులు తెలిపారు, మొత్తానికి గైనకాలజిస్టులు ఇదే విషయాన్ని తెలియచేస్తున్నారు.

 

 

నెలసరి సమయంలో కరోనా టీకా తీసుకోవచ్చా అని చాలా మందికి అనుమానం ఉంటుంది అయితే

ఈ సమయంలో వారి రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని అనుకుంటాం.. అది అపోహ మాత్రమే, మీరు కచ్చితంగా టీకా తీసుకోవచ్చు, ఎలాంటి అసత్య వార్తలు నమ్మక్కర్లేదు అని తెలిపారు వైద్యులు.