దేశవ్యాప్తంగా లంపీ చర్మవ్యాధి చెమటలు పట్టిస్తుంది. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీన్ని బట్టి వ్యాధి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.