మ‌హిళ‌లు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

మ‌హిళ‌లు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

0
85

కిడ్నీలో చాలా మందికి రాళ్లు కూడా వస్తూ ఉంటాయి ..అయితే మనం తినే ఆహరమే కాదు మనం చేసే కొన్ని స్వయంకృతాపరాదాలు కూడా ఇలాంటి ఒత్తిడి సమస్యలకు కారణం అవుతాయి, ఇక చాలా మంది మూత్రం వచ్చిన సమయంలో దానిని ఆపుతూ ఉంటారు… ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇలా శరీరంలో ఆపడం వల్ల మూత్రం స్టిక్ గా కొన్ని పదార్దాలతో మారిపోతుంది.

ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి… ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటే అవి ఇంకా బంకగా మారి ఇంకా పెద్ద రాళ్లు వస్తాయి. ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. ..కిడ్నీల్లో రాళ్ళు స్త్రీ పురుషులిద్దరికి వస్తాయి. అయితే ఎక్కువగా స్త్రీలు మూత్ర సమస్యలతో బాధపడితే వెంటనే అశ్రద్ద చేయకండా చూపించుకోవాలి..

ఎప్పుడూ మూత్రం వచ్చినా స్త్రీలు ఆపకుండా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు.. దీని వల్ల వారికి కిడ్నీ ప్రమాదం వస్తుంది అని చెబుతున్నారు. స్త్రీలకి దీని వల్ల పలు సమస్యలు వస్తాయి, ఇన్ ఫెక్షన్ సోకుతుంది, బ్లాడర్ సమస్యలు వస్తాయి, దుర్వాసన వైట్ డిశ్చార్జ్ తో వస్తుంది, కిడ్నీలో రాళ్లు వస్తాయి, ఇక యూరిన్ లో రక్తం కలిసి వస్తుంది.. ఈ సమస్యలు దీనికి ప్రధాన కారణం, ఇక యూరిన్ సమయంలో మంట కూడా వస్తుంది అనేది గుర్తు ఉంచుకోండి, అందుకే బస్సుల్లో ప్రయాణం చేసిన సమయంలో ఆచితూచి వాటర్ తాగాలి అని చెబుతున్నారు వైద్యులు.