మైదా పిండి వంటలు మన దేశంలో చాలా ఎక్కువగా తింటారు. మైదాతో జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తయారు అవుతుంది. మైసూరు బజ్జి, పునుగులు, సమోసాలు, బ్రెడ్, బన్, కేక్ ఇలా చెబితే మైదాతో చాలా ఫుడ్ వెరైటీలు చేస్తారు. ఇక నిలువ ఉంటాయి కాబట్టి స్వీట్ షాపుల్లో కూడా మైదాతో హాట్ ఐటెమ్స్ తయారీ ఉంటుంది. ఇంతకీ మైదా ఎలా తయారు చేస్తారో తెలుసా.
మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, అలాగే Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అది మైదా అవుతుంది. మీరు ఇది గమనించాలి అంటున్నారు వైద్యులు. మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు.
ఇక మైదాతో చేసే పరాటాల వల్ల చాలా ఇబ్బంది. ఈ ఫుడ్ వల్లే చాలా మందికి మలబద్దకం, అజీర్తి, కడుపులో నొప్పి, అరుగుదల లేకపోవడం సమస్యలు వస్తున్నాయి. ఇక ఇది అధికంగా తింటే షుగర్ పలకరిస్తుంది. గుండె జబ్బులు వస్తాయి. ఇందులో అసలు పీచు పదార్థం ఉండదు అందుకే జీర్ణం కావడానికి మన బాడీని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక పోస్టర్లు అంటించడానికి మైదా గమ్ గా ఉపయోగపడుతుంది. అయితే మన బాడీకి చేటు చేస్తుంది. ముఖ్యంగా రోజూ బజ్జీలు తినేవారు కాస్త ఆగండి. ఏదో అప్పుడప్పుడూ అయితే ఒకేగాని రోజూ అయితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.