మల్లె అంటే చాలా మందికి ఇష్టం.. ఇక ఆడవారు మల్లెల్ని బాగా ఇష్టపడతారు ఇక అబ్బాయిలకి కూడా మల్లెలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.వేసవి సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం.
అయితే శరీరానికి అందమే కాదు సౌందర్య పోషణలోనూ మల్లెలు చాలా బాగా ఉపయోగపడతాయి.
1..బాగా ఎండలొ తిరిగిన వారు కళ్లపై ఒత్తిడి ఉంది అనుకున్నవారు, కళ్ళమీద విరిసిన మల్లెలను ఉంచితే ఆ ఒత్తిడి తొలగిపోతుంది.
2..చుండ్రు బాధితులు మెంతులు, ఎండుమల్లెలు కలిపి నూరి తలకు పట్టిస్తే సమస్య తగ్గడమే కాక జుట్టు పట్టు కుచ్చులా మెరిసిపోతుంది
3. ఇక మల్లెలు గులాబీ రేకలు రసం తీసి అది ముఖానికి రాస్తే తెల్లగా కాంతివంతంగా ఉంటుంది.
4..మల్లెలు శృంగారపరమైన కోర్కెలను పెంచుతాయి. మల్లెల నూనెను మొటిమల మచ్చల మీద రాస్తే ఆ మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.
5. మల్లెలు నడుం పై వేసుకుని మర్దనా చేసినా వెన్ను నడుం నొప్పి తగ్గుతుంది.
6..మల్లెపూలు నీటిలో వేసుకొని గంట తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే శరీరం ఆహ్లదంగా ఉంటుంది, శరీరం తేలికగా ఉంటుంది.
7. మల్లెలకు పాలు తేనే గంధం వేసి ( ఏదో ఒకటి మాత్రమే) వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే కాంతివంతంగా మారుతుంది.