మనం రోజు నీరు ఎక్కువ తాగితే మంచిదా చెడా ? ఎక్కువ తాగితే ఏమవుతుంది ?

మనం రోజు నీరు ఎక్కువ తాగితే మంచిదా చెడా ? ఎక్కువ తాగితే ఏమవుతుంది ?

0
126

మనకి తెలిసిందే మంచి నీరు ఎక్కువ తాగాలి అని చెబుతారు వైద్యులు, అంతేకాదు ఎండలో ప్రయాణం చేసి వచ్చినా చెమట రూపంలో నీరు బయటకు వస్తుంది… కాబట్టీ ఈ సమయంలో మనం వెంటనే నీరు కూడా తాగుతాం, డీ హైడ్రేడ్ సమస్య రాకుండా చూసుకుంటాం, అయితే మనం రోజూ నాలుగునుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు, పేగులు అలాగే కడుపు క్లీన్ అవుతుంది అని కూడా చెబుతారు వైద్యులు, మలబద్దకం కూడా ఉండదు.

ప్రతి రోజు తగినన్ని మంచినీరు తీసుకుంటే ఆరోగ్యంతో మెరుగైన మేని ఛాయను పొందవచ్చు. ఎంత నీరు తీసుకోవాలో అంతే తీసుకోవాలి .. శరీరానికి మంచిది కదా అని పది లీటర్లు తాగినా ప్రమాదం వస్తుంది, మంచినీరు అధికంగా తీసుకోవడం వలన శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పుతుందని, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఇవన్నీ పట్టించుకోకుండా నీరు అధికంగా తీసుకుంటే మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో రక్తనాళాలు దెబ్బతింటాయి, అందుకే అతిగా నీరు తీసుకోవద్దు, సుమారు నాలుగు లీటర్ల వరకూ రోజుకి నీటిని తీసుకుంటే సరిపోతుంది, అంతకు మించి తీసుకుంటే సమస్యలు తప్పవు.