మందార పువ్వులతో కలిగే 10 ప్రయోజనాలు ఇవే ? ఇలా చేయండి

మందార పువ్వులతో కలిగే 10 ప్రయోజనాలు ఇవే ? ఇలా చేయండి

0
89

చూడగానే మందారం ఎంతో అందంగా ఉంటుంది, అసలు ఈ ఎర్రటి పువ్వుని దేవుడికి కూడా పెడతారు, అయితే శరీరానికి సౌందర్యానికి కూడా ఇది చాలా మంచిది. కొబ్బరినూనెలో మందార పూలను వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇక చుండ్రు సమస్యలు ఉండవు, తెల్లటి జుట్టు లేడిస్ కు తొందరగా రాదు, అలాగే పేల సమస్యలు ఉండవు, ఇలా వారానికి ఓరోజు రాసినా జుట్టు బాగుంటుంది, ఇక చిన్నపిల్లలకు 10 ఏళ్ల వయసు నుంచి చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది.

మందార పూలు తీసుకుని పేస్ట్ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి. పలచబడకుండా ఉంటుంది, చుండ్రు రాలే సమస్య ఉంటే చిన్న చిట్కా ఉంది, మందారపువ్వులు పచ్చిగా పేస్ట్ చేయండి, అందులో శనగపిండి పెరుగు సమానంగా కలిపి తలకి పట్టించండి. చుండ్రు జుట్టు రాలడం తగ్గుతుంది, ఇక మందారం పేస్ట్ తో తల స్నానం చేశాక ఈ సమయంలో కుంకుడితో తల స్నానం చేయండి. షాంపుల కంటే ఇదే ఉత్తమం అంటున్నారు నిపుణులు.