బెంగాళ్ వెళితే సరికొత్త స్వీట్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ మిఠాయిలు తయారు చేయడంలో వారు ఎక్స్ పర్ట్స్, పైగా బెంగాళీ స్వీట్స్ కు మంచి రుచి ఉంటుంది డిమాండ్ ఉంటుంది, అందుకే చాలా షాపులు ఆ స్వీట్స్ ని అమ్ముతాయి, అయితే కరోనాకి సంబంధించి కొందరు వ్యాపారులు కరోనా స్వీట్స్ కూడా తయారు చేశారు అనేది తెలిసిందే.
తాజాగా కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు, ప్రముఖ సుందర్భన్ అడవుల్లోంచి సేకరించిన తేనె, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసీరసంతో తయారుచేసిన ఈ మిఠాయికి ఆరోగ్య సందేశ్‌గా నామకరణం చేశారు.
దీనిని చాలా సహజసిద్దంగా తయారు చేస్తున్నారు, ఎలాంటి రంగులు పదార్దాలు ఎసైన్స్ ఉండవు
ఈ మిఠాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇది కరోనాకు విరుగుడు మందు కాదని, కేవలం రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు. దీని ధర కూడా 500 లోపు ఉంటుంది అని చెబుతున్నారు.