దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా 6వేలకు పైగా కేసులు నమోదుకాగా.. గడిచిన 24గంటల్లో కాస్త తగ్గుముఖం పట్టి 5,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 32,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11మంది మరణించారు. ఇప్పటివరకు 5,30,965 కరోనా మరణాలు సంభవించాయి.
కరోనా కేసుల పెరుగుదలతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. హర్యానా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. అలాగే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించాయి. నిబంధనలు పాటించని ప్రజలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు కరోనా కట్టడికి జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 10,11వ తేదిల్లో కరోనా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెపింది.