మాస్క్ పెట్టుకుంటున్నారా త‌ప్ప‌కుండా ఇది చ‌ద‌వండి

మాస్క్ పెట్టుకుంటున్నారా త‌ప్ప‌కుండా ఇది చ‌ద‌వండి

0
99

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి త‌మ‌పై ప్ర‌తాపం చూప‌కుండా ఉండాలి అంటే తీసుకునే జాగ్ర‌త్త‌లే మిమ్మ‌ల్ని కాపాడ‌తాయి.. ఇంటిలోనే ఉండాలి ఒక‌వేళ ఏదైనా అవ‌స‌రం ఉండి బ‌య‌టకు వ‌స్తే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అని చెబుతున్నారు, ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది ఆ మాస్క్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడితే అస‌లుకే ముప్పు అంటున్నారు నిపుణులు.

అంద‌రూ కాదు సాధార‌ణంగా ఏ స‌మ‌స్య లేక‌పోతే ఈ మాస్క్ పెట్టుకోకండి, కేవ‌లం తుమ్ములు, దగ్గులు ఉన్న వారు మాత్రమే మాస్క్‌లు ధరించాలి. మంచి మాస్క్ కొనుక్కోవాలి, ధ‌ర త‌క్కువ అయిన మాస్క్ వాడినా కేవ‌లం కొద్ది నిమిషాలు మాత్ర‌మే వాడాలి.

మాస్క్‌ లోపల చేతులతో తాకినా, మాస్క్‌ వేసుకున్నాం కదా అని చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా నష్టపోవాల్సి వస్తుంది, ఇక మాస్క్ ధ‌రించాక దానిని ముట్టుకోకూడ‌దు, చేతులు అటూ ఇటూ తిప్పుతూ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాస్క్ వాడ‌కండి, అస‌లు దానిని పెట్టుకున్న త‌ర్వాత ముట్టుకోకూడ‌దు, వాట‌ర్ కూడా దానిపై ప‌డ‌కూడ‌దు, ఏదైనా తిందాం అని మాస్క్ తీస్తే మ‌ళ్లీ అది వాడ‌కండి, మామూలు మాస్కులు కాదు వీలైతే ఎన్‌-95 మాస్కులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.