మాస్క్ వాడే ప్రతీ ఒక్కరు తెలుసుకోండి ఎలా వాడాలి ఎలా ఉతకాలి

మాస్క్ వాడే ప్రతీ ఒక్కరు తెలుసుకోండి ఎలా వాడాలి ఎలా ఉతకాలి

0
89

ఇది కరోనా టైమ్ కాబట్టి కచ్చితంగా అందరూ మాస్క్ వాడుతున్నారు, కచ్చితంగా వాడాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం పాలవుతాం, అయితే ఈ మాస్క్ లు వాడుతున్న వారు కచ్చితంగా వాటిని శుభ్రం చేసుకోవాలి, రోజూ వీటిని శుభ్రం చేసుకోవాలి, వారానికి ఓసారి శుభ్రం చేసి వాడితే చాలా ప్రమాదరకం.

డిజ్ ఇన్ఫెక్టంట్స్ చల్లకండి… క్లాత్ ఫేస్మాస్క్ మీద డిజ్ఇన్ఫెక్టంట్ స్ప్రే చేసి శుభ్రం చేయడం సరైంది కాదు. దీని వల్ల ముక్కు నోరు దగ్గర రాషెస్ వస్తాయి… చర్మం దురద, మంటగా అనిపిస్తుంది. ఇక చల్లని నీటిలో కాకుండా మాస్క్ కచ్చితంగా గోరు వెచ్చని లేదా వెచ్చని నీటిలో ఉతకాలి.

సబ్బు సర్ఫ్ వేసి మాస్క్ ఉతకవచ్చు…. నూనెలు లేహ్యాలు మాస్క్ లకి ఎట్టి పరిస్దితిలో రాయవద్దు
వేడినీళ్లతో మాస్కులను శుభ్రం చేయడం అన్ని విధాలా మేలు. మాస్క్ లు కర్చీఫ్లు బట్టలు అన్నీ కలిపి వాషింగ్ మిషన్లో వేయవద్దు… దేనికి అవి శుభ్రంగా ఉతకాలి విడివిడిగా.