ఏపీ ప్రజలకు భారీ ఊరట..హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
103

ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపగా తాజాగా ప్రజలకు భారీ ఊరట లభించింది. తాజాగా ఏపీ వ్యాప్తంగా 18,601 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 1597కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కోవిడ్ వల్ల ఎనిమిది మంది చనిపోయారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 649 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62395 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8766 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  39

చిత్తూరు         123

ఈస్ట్ గోదావరి   478

గుంటూరు  144

వైస్సార్ కడప  117

కృష్ణ   220

కర్నూల్  77

నెల్లూరు   55

ప్రకాశం    67

శ్రీకాకుళం 15

విశాఖపట్నం  69

విజయనగరం 100

వెస్ట్ గోదావరి   93