ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 27,522 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1679 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,653 మంది కరోనా కాటుకు బలైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,598 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 102
చిత్తూరు 102
ఈస్ట్ గోదావరి 350
గుంటూరు 212
వైస్సార్ కడప 104
కృష్ణ 225
కర్నూల్ 103
నెల్లూరు 91
ప్రకాశం 87
శ్రీకాకుళం 22
విశాఖపట్నం 128
విజయనగరం 11
వెస్ట్ గోదావరి 142