మట్టిపాత్రల్లో వండిన భోజనం తింటున్నారా దీని వ‌ల్ల లాభాలు ఇవే

మట్టిపాత్రల్లో వండిన భోజనం తింటున్నారా దీని వ‌ల్ల లాభాలు ఇవే

0
93

ఇప్పుడు స్టీల్ నాన్ స్టిక్ ఇలా అనేక మెట‌ల్ పాత్ర‌లు వ‌చ్చాయి.. కాని గ‌తంలో అంద‌రూ మ‌ట్టి పాత్ర‌ల్లోనే వంట‌లు వండేవారు, అందులోనే అన్నం ప‌ప్పు చారు ఇలా వండుకునే వారు ..కాని ఇప్పుడు మొత్తం తినే ఆహ‌రం మారింది, వండే స్టైల్ కుకింగ్ పాత్ర‌లు అన్నీ మారాయి.

మ‌ళ్లీ ఇటీవల కాలంలో మట్టి పాత్రల వాడకం ఎక్కువైంది. మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే వీటి వాడకం ఇటీవల కాలంలో పెరిగింది. చాలా ఉత్త‌రాధి హోట‌ల్స్ తమిళ‌నాడు క‌ర్ణాట‌క‌లో ఇలా వండే రైస్ కూడా ఉంటోంది.

ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. మట్టి కుండల్లో వంట చేయడం వలన పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. మట్టి కుండలో వండిన ఆహారంలో నూనె శాతం తక్కువుగా ఉంటుంది. బ‌ల‌మైన ఆహ‌రంగా వీటిని చెబుతారు.. నేరుగా ఆహ‌రంలో పోష‌కాలు ఉంటాయి, బెస్ట్ రెసిపీల‌తో పాటు మ‌ట్టి పాత్ర‌ల వ‌ల్ల ఎలాంటి చెడు ఉండ‌దు. సో వీలైతే మీరు ఇలా వండుకు తినండి అంటున్నారు వైద్యులు.