శృంగార సామర్థ్యం పెరగాలా? అయితే ఇలా చేయండి

May sexual ability increase

0
147

శృంగార కోరికల విషయంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవారు ఎప్పుడెప్పుడు ఈ సుఖాన్ని అనుభవిద్దామా అని ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పెళ్లైన కొత్తలో పగలు, రాత్రి అని తేడా లేకుండా శృంగార కోరికల్లో మునిగి తేలుతుంటారు. అయితే.. కొంత మంది మగవారికి ఈ అంశాల పట్ల అస్సలు ఆసక్తి ఉండదు. అందమైన భార్య ఉన్నా పట్టనట్టుగానే ఉంటారు. మరి, ఇలాంటివారు శృంగారం పట్ల ఆసక్తి పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓ సారి చూద్దాం.

నిజానికి సెక్స్​ సామర్థ్యాన్ని పెంచే ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా మనం తీసుకునే అన్ని పోషక విలువలు కలగలిసిన సమతుల్య ఆహారంతోనే సెక్స్​ సామర్థ్యం పెరుగుతుంది. పిండి పదార్థాలు, మాంసకృతులు, ప్రోటీన్లు, విటమిన్లు కలిసిన ఆహారం మేలు చేస్తుంది. ఎవరి ఆరోగ్యం బాగుంటుందో వారి శృంగారం సామర్థ్యం కూడా బాగుంటుంది. ఏవో కొన్ని కాయలు, ఆకులు తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనేది అవాస్తవం.

ఉల్లిపాయ‌కు బ్లడ్ థిన్నింగ్ లక్షణాలున్నాయి. అందుకే ఇవి ఎక్కువగా తీసుకుంటే శరీరం మొత్తం రక్త ప్రసరణ మెరుగుపడి అంగంలోకి సరిపడినంత బ్లడ్ ఫ్లో అవుతుంది. జీడి పప్ప, బాదం పప్పు, ఆక్రోట్లు వంటి క్రమం తప్పకుండా తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరగడంతోపాటు మెరుగైన భావప్రాప్తి పొందుతారట.