మీరు క్యాబేజీ తింటున్నారా అయితే ఈ లాభాలు మీ సొంతం

మీరు క్యాబేజీ తింటున్నారా అయితే ఈ లాభాలు మీ సొంతం

0
142

క్యాబేజీ కూర అంటే అయ్యబాబోయ్ అనేవారు చాలా మంది ఉంటారు, మరికొందరు ఇష్టంగా తింటారు, అయితే అన్నీ రకాల ఫుడ్ తింటేనే ఒంటికి మంచిది, కొన్ని వద్దు అంటే కొన్ని జబ్బులు కూడా పలకరిస్తాయి అంటున్నారు నిపుణులు.

అయితే ఇది వాసన వేరుగా ఉన్నా చాలా మంది ఇష్టపడతారు.. వారానికి ఒకసారైనా క్యాబేజీ- కాలిఫ్లవర్లను తప్పనిసరిగా తినమంటున్నారు పరిశోధకులు. వీటిలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారిణులుగా పనిచేస్తాయంటున్నారు.

ఇవి వారానికి ఒకసారి తింటే వారిలో క్యాన్సర్ రావడం చాలా వరకూ తగ్గిందట..ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు మంచి మందుగా పనిచేస్తాయని ఈ అధ్యయనాల్లో తేలింది. వీళ్లకి శ్వాస సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి, అలాగే జలుబు వైరల్ ఫీవర్ సమస్యలు లేని వారిగా ఉంటారట.
వెజిటేబుల్ సలాడ్లో సన్నగా తరిగిన క్యాబేజి ముక్కలను కూడా చేర్చి తీసుకుంటే మంచిది. ఇక ఆవిరిగా తీసుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు, కారాలు మషాలాలతో ఇవి తీసుకోవద్దు అంటున్నారు.