మనలో చాలా మంది పప్పు ధాన్యాలు ఇష్టంగా తీసుకుంటారు ముఖ్యంగా ఇవి ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఫుడ్, అంతేకాదు మంచి బలమైన ఆహారం కూడా, అందుకే ఆహారంలో పప్పు ధాన్యాలకు మంచి ప్రాధాన్యత ఉంది.
కంది, పెసర, మినుము, శనగ, అలసందలు వంటి పప్పు ధాన్యాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ఇవి అతిగా తిన్నా గ్యాస్ సమస్యలు మలబద్దకం ఉంటాయి అందుకే రెండు రోజులకి ఓసారి తీసుకుంటారు చాలా మంది.
అయితే దీనికి వైద్యులు ఏం చెబుతున్నారు అంటే కచ్చితంగా పప్పు ధాన్యాలు ఉడకబెట్టి నానబెట్టినవి తీసుకోవాలి అని చెబుతున్నారు..నెలకి ఓ 15 రోజులు పప్పు ధాన్యాలు తీసుకున్నా మంచిదే అంటున్నారు వైద్యులు.
కందిపప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
పెసర పప్పు ప్రొటీన్లు, క్యాలరీలు ఉంటాయి. శరీరానికి అవసరం అయ్యే ఐరన్, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి
శనగపప్పు కూడా ప్రొటీన్లు ఉండే ఫుడ్
మినపప్పు వారానికి రెండు రోజులు తీసుకున్నా ఇది వెన్నుపూసకు ఎంతో బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్స్ శరీరానికి
ఎంతో మంచిది
ఉలవల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఉలవలు నెలకి ఓసారి అయినా దీనితో ఫుడ్ చేసుకోండి