మీరు రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారా ఈ విషయం తప్పక తెలుసుకోండి

మీరు రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారా ఈ విషయం తప్పక తెలుసుకోండి

0
99

మనం తినే ఆహరం ఎంత శుభ్రంగా నాణ్యంగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది ,అయితే ఈ రోజుల్లో చాలా మంది కాస్త ఖరీదైనా సన్ ప్లవర్ పల్లీల నూనెలు వాడుతున్నారు, అయితే ఏది అతి అనేది మంచిది కాదు అంటున్నారు వైద్యులు.

వైద్యులు చెప్పేది ఏమిటి అంటే నాన్ రిఫైండ్ నూనె వాడాలి, అంటే నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. రిఫైండ్స్ చేస్తే అందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయి
రిఫైండ్ డబుల్ రిఫైండ్ చాలా కంపెనీలు చేస్తాయి, అంత రిఫైండ్ చేయడం వల్ల ఇందులో పలు కెమికల్స్ వాడుతారు.

ఇలాంటి ఆయిల్స్ లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ ఉండవు.
అందుకే ఏ రిఫైండ్ నూనె అయినా వద్దు అంటున్నారు, గానుగ నుంచి వేరు శెనగ నూనె, కొబ్బెర నూనె, నువ్వుల నూనె ఆవాల నూనెలు మాత్రమే వాడాలి అని సలహా ఇస్తున్నారు నిపుణులు.
ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలు గేదెలకు, పశువులకు మాత్రమే పెట్టాలి. మనకు ఏ మాత్రం ఈ సన్ ప్లవర్ ఆయిల్ వాడదగినది కాదు అంటున్నారు నిపుణులు, సో నిపుణులు ఈ విషయాలు చెబుతున్నారు.ఏది వాడినా తక్కువ వాడాలి గానుగ నూనె మంచిది.