పాలల్లో పసుపు వేసుకుని తాగితే దాని వల్ల కలిగే లాభాలు ఇవే

పాలల్లో పసుపు వేసుకుని తాగితే దాని వల్ల కలిగే లాభాలు ఇవే

0
143

చాలా మందికి మనలో పాలు తాగే అలవాటు ఉంటుంది, అయితే కొందరు అందులో మిరియాల పొడి, యాలకుల పొడి కలుపుకు తాగుతారు, ఇంకొందరు పసుపు పాలు కూడా తాగుతారు, మంచి ఇమ్యునిటీ వస్తుంది, అలాగే శరీరంలో ఏదైనా వైరస్ ఉన్నా ఈజీగా ఈ పసుపు పాలకు తగ్గుతుంది, ఇక జలుబు కూడా తగ్గుతుంది.

అయితే ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆరోగ్య రహస్యం అనే చెప్పాలి..పాలలోని పోషకాలు, పసుపులోని ఔషద గుణాలు.. మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది. యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

అయితే కెమికల్ పసుపు రంగు కలిపిన పసుపు కాకుండా పసుపు కొమ్ములు ఆడించిన మర పట్టించినది వాడండి, ఇది చాలా మంచిది, కలర్ కోసం పాకులాడవద్దు..దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది. వేడి వేడి పాలలో కంటే గోరు వెచ్చని పాలల్లో పసుపు వేసుకుని తాగితే మంచిది అంటున్నారు వైద్యులు.