కారం పొడి వాడుతున్నారా అది కల్తీ కారమో మంచిదో ఇలా తెలుసుకోండి

కారం పొడి వాడుతున్నారా అది కల్తీ కారమో మంచిదో ఇలా తెలుసుకోండి

0
114

మనం ఏ కూర వండినా కారం మాత్రం పక్కా వేస్తాం, ఎంత పచ్చి ఎండు మిర్చి వేసినా కారం మాత్రం వేయాల్సిందే, అందుకే కారం నిత్య అవసర వస్తువు అనే చెప్పాలి, అయితే కొందరు వ్యాపారులు అధిక ఆశ డబ్బుపై వ్యామోహంతో ఈ కారంలో కూడా కల్తీ చేస్తున్నారు, దీని వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి,

తాజాగా దీనిపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, విజిలెన్స్ ఆఫీసర్లు దాడులు చేస్తే పలువురు వ్యాపారులు కల్తీకారంతో అడ్డంగా దొరికారు.
ఇక్కడ లూజ్ కారం అమ్ముతున్నారు మిల్లులో, ఇందులో ఏకంగా ఎర్ర రంగు పొడి ఆ కారంలో కలుపుతున్నారు, ఇది తెలియక చాలా మంది కారం రేటు తక్కువ అని పట్టుకు వెళుతున్నారు, అది వారి ప్రాణాలకే ప్రమాదం. ఇది కుంకుమ పొడిలా ఉంటుంది.

కిలో 100 రూపాయలు కూడా ఉండదు ఇది కారంలో కలిపి అమ్ముతున్నారు..ఇది మీరు వాటర్ లో వేస్తే మంచి కారం అయితే, మీకు వాసన తెలుస్తుంది, ఇలా రంగు కారం అయితే పూర్తిగా రంగునీరులా మారుతుంది తస్మాత్ జాగ్రత్త.