మిరియాలు వాడుతున్నారా ఈ లాభాలు తెలుసుకోండి

మిరియాలు వాడుతున్నారా ఈ లాభాలు తెలుసుకోండి

0
89

ఈ క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఎలా కొన‌సాగుతోందో చూస్తునే ఉన్నాము, అయితే ఈ క‌రోనా వైర‌స్ కి వ్యాక్సిన్ వ‌స్తే త‌ప్ప దీని నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం లేదు, అయితే ఈ స‌మ‌యంలో అంద‌రూ ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరిగే ఫుడ్ తినాలి అని చూస్తున్నారు, వైద్యులు అదే చెబుతున్నారు.

అందుకే బాదం నిమ్మ ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, అయితే ఈ నాలుగు నెల‌లుగా మ‌రో ఐటెం కూడా చాలా మంది కొంటున్నారు, అదే మిరియాలు, అయితే ఈ మిరియాలు ఒంటికి చాలా మంచిది
శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచటంలో మిరియాలు కీలకమైన పాత్రను పోషిస్తుంది. మిరియాలలో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ రోగ కారకాలను నిర్మూలిస్తాయి.

ఇక చాలా మంది క‌షాయంలా తీసుకుంటారు, అలాగే మ‌రిగించిన పాల‌ల్లో వీటిని వేసి తీసుకుంటారు, ఎలాగైనా తీసుకోవ‌చ్చు, మిరియాల పొడి కూడా ఆహ‌రంలో వాడ‌తారు, అయితే అతి మాత్రం వ‌ద్దు ఇది కూడా శ‌రీరానికి బాగా హీట్ చేస్తుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో అరస్పూన్ మిరియాల పొడిని కలుపుకొని ఉదయాన్నే తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.. కండ‌రాల నొప్పి వాపు ఇలాంటివి ఏమైనా త‌గ్గుతాయి.