మనీ ప్లాంట్లు తీగ మొక్కలు పెంచుతున్నారా వైద్యులు ఓ మాట చెబుతున్నారు జాగ్రత్త

Money Plants Are Growing Vine Plants Beware of what doctors are saying

0
106

ఈ రోజుల్లో అందరూ ఇంటిని చాలా అందంగా తీర్చి దిద్దుకుంటున్నారు. ప్రకృతి మన పక్కన ఉండే విధంగా మొక్కలు కూడా పెంచుకుంటున్నారు. చిన్న ఇళ్లు అయినా సరే ఇండోర్ గార్డెన్ , అలాగే టెర్రస్ పై, గార్డెన్ ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక బోన్సాయ్ ట్రీలు అలాగే తీగజాతి మొక్కలు పెంచుకుంటున్నారు. వీటి వల్ల ఇంటికి అందం అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది.

ఎక్కువ మంది ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుతారు . ఇది ఇంట్లో ఉండటం వల్ల డబ్బులు వస్తాయని, సంపద వస్తుందని నమ్మకం.
అయితే వైద్యులు ఓ విషయం చెబుతున్నారు. పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయి. అందుకే ఇలాంటి మొక్కలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు.

వీటి కోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపునీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ఇక వీటిలో
డెంగీ దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయి. అందుకే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిర్మాణాలు, సెల్లార్లు కుండీలు ఇవన్నీ ఉన్న వారు అక్కడ నీరు నిల్వ లేకుండా చూసుకుంటే ఈ దోమల సమస్య ఉండదు.