హెల్త్‌ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌..WHO సంచలన ప్రకటన

0
99

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల కల్లోలం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్లు, ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్. ఇవన్నీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్‌లోనూ ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మూడు కేసులు బయటపడ్డాయి. ఆ మూడు కేసులూ కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వైరస్ 75 దేశాల్లో వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుంటడంతో మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది WHO. ‘పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్’నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు.

తద్వారా అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో తీసుకొచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్‌ఆర్) ప్రకారం.. అన్ని దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీపై కచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి.