Big Breaking: మంకీపాక్స్‌ కలకలం..దేశంలో తొలి మరణం నమోదు

0
88

దేశంలో మంకీపాక్స్‌కు సంబంధించి తొలి మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇతనికి పరీక్షలు నిర్వహించగా..మంకీపాక్స్‌ పాజిటివ్‌గా సోమవారం తేలింది. ఇంకా దీనికి సంబంధించి ఆ యువకుడిని దగ్గరగా కలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్య సిబ్బంది సహా 20 మందిని పరిశీలనలో ఉంచినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.