ఏపీలో మంకీపాక్స్‌ కలకలం

0
105

ఏపీలో మంకీపాక్స్‌ కలకలం రేపింది. దుబాయ్‌ నుంచి విజయవాడకు వచ్చిన ఓ రెండేళ్ల చిన్నారికి మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. చిన్నారి ఒంటిపై దద్దుర్లు రావడంతో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. చిన్నారి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పుణె ల్యాబ్‌కు పంపారు. ఫలితాలు వస్తే కానీ అది మంకీపాక్స్‌ అవునో కాదో తెలిసి అవకాశం ఉంది.