దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో చూస్తే కరోనా భయం వెంటాడుతూనే ఉంది. లక్షల మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఏ స్టేట్ చూసినా ఇదే పరిస్దితి. దీంతో బయో వేస్టేజ్ కూడా పెరుగుతోంది. మొత్తం దేశంలో 45,308 టన్నుల కోవిడ్ బయో వ్యర్ధ పదార్దాలు పేరుకున్నాయి.వీటి సురక్షిత నిర్వహణ ప్రశ్నార్థకమే అని చెబుతున్నార నిపుణులు.
మేలో 6.3టన్నులు రాష్ట్రంలో సగటున రోజుకు ఉత్పత్తి అయిన బయో మెడికల్ వ్యర్థాలు అని లెక్కలు చెబుతున్నాయి.
ఆరోగ్య, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో ఈ కరోనా తీవ్ర ప్రభావానికి గురిచేసింది. కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోవడంతో, ఎన్నడూ లేని విధంగా పీపీఈ కిట్లు, మాస్క్లు, ఫేస్షీల్డ్లు, గ్లౌజులు, సిరంజీలు, హెడ్, షూ కవర్లు ఇలాంటవి విపరీతంగా వాడేశారు.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే దారణంగా వీటి ఉత్పత్తి వాడకం జరిగింది, 50 శాతం ఈ రెండు నెలల్లో వినియోగం జరిగింది.
ఏప్రిల్లో రోజుకు 139 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయితే మేలో 203 టన్నులకు పెరిగింది.ఈ వ్యర్థాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా బయటికి వదిలేందుకు దేశవ్యాప్తంగా 198 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటిని ఏజెన్సీల ద్వారా సేకరిస్తారు.