Flash- దేశం​లో ఒక్కరోజే 2 వేలకు పైగా కరోనా మరణాలు

More than 2 thousand corona deaths in a single day in the country

0
108

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరోసారి హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 3,46,33,255

మొత్తం మరణాలు: 4,73,326

యాక్టివ్​ కేసులు: 99,155

మొత్తం కోలుకున్నవారు: 3,40,60,774

కొవిడ్ మరణాల లెక్కలు సవరించాక బిహార్​లో 2,426, కేరళలో 263 మృతులతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొవిడ్ కేసులు 50 వేల కంటే తక్కువగా నమోదుకావటం వరుసగా ఇది 161వ రోజు అని కేంద్రం తెలిపింది. యాక్టివ్ ​కేసుల సంఖ్య.. మొత్తం కేసుల్లో 0.29 శాతం ఉన్నట్లు పేర్కొంది.

పెరిగిన మరణాల రేటు..

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.35 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.73 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.37శాతంగా ఉందని పేర్కొంది.