చాలా మంది లేవగానే ముందు కాఫీ టీ తాగుతారు కొంత మంది గోరు వెచ్చిన నీటిని తాగుతారు మరికొందరు తెనె నిమ్మరసం తాగుతారు… ఎవరి ఇంట్రస్ట్ డైట్ ప్లానింగ్ బట్టీ వారు ఆహరం తీసుకుంటారు, అయితే ఉదయం చాలా మంది లేవగానే పండ్లు తీసుకుంటారు ఉదయం 9 గంటలకు పండ్లు తినేవారు ఉంటారు.
అయితే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కాని దానికి ఓ సమయం ఉంటుంది ఆ సమయంలో తింటే శరీరానికి మంచిది అని చెబుతున్నారు వైద్యులు… కొన్ని పండ్లను పరగడుపున అస్సలు తినకూడదు. పరగడుపుతో వాటిని తీసుకుంటే చాలా అనర్ధాలు వస్తాయి అలాంటి పండ్లు చూద్దాం
ఉదయం జిమ్ కు వెళ్లి వర్క్ అవుట్లు చేసే వారు చాలా వరకూ అరటి పండ్లు తింటారు ఇవి శక్తిని ఇస్తాయి అని వీటిని తింటారు.. అయితే, అరటిపండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండెకు చేటు చేస్తుంది. అందుకే అరటి పండ్లను ఉదయాన్నే తీసుకోకూడదు. మధ్యాహ్నం బెటర్.
పుల్లటి పండ్లలో గ్యాస్ అధికంగా ఉంటుంది. వీటిని పరగడుపున తీసుకుంటే, గ్యాస్, అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పుల్లటి ద్రాక్ష ఉదయం తీసుకోకూడదు.లిచీ పండ్లు పియర్ ఫ్రూట్స్ అసలు ఉదయం తీసుకోకూడదు, దోసకాయ పనసకాయ కూడా ఉదయం అస్సలు తీసుకోవద్దు.