దోమలు ఎందుకు కుడతాయి. మనల్ని కొట్టాలనే సంగతి దోమకు ఎలా తెలుస్తుంది? దోమలు కొంతమందిని ఎక్కువగా మరికొంతమందిని తక్కువగా కుడతాయా? ఇలాంటి ప్రశ్నలు మనకు తడుతూ ఉంటాయి. ఈ అంశాలపై ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆసక్తికర సమాధానాలు మీకోసం..
తాజాగా ఈ నెలలో నేచర్ అనే సైన్సు పత్రిక ఆసక్తికరమైన పరిశోధనను ప్రచురించింది. ఈ పరిశోధన ఏమని తెలిసిందంటే..మనుషులను కొట్టాలనే ఆలోచన దోమలకు ఎలా వచ్చిందో ఈ పరిశోధన చెబుతుంది. సాధారణంగా మనం కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తుంటాం. అయితే ఈ వాసనను దోమలు పసిగడతాయి. అప్పుడు అవి మన మీదకు వస్తాయి.
అయితే దోమ మనిషిని కొట్టడానికి నాలుగు అంశాలు ఉంటాయి. వాసన, రంగు, చెమటలో ఉండే పదార్ధాల వాసన, శరీర ఉష్ణోగ్రత ద్వారా దోమలు మనుషులను కుడతాయి. రెడ్, ఆరెంజ్, ముదురు నీలం రంగు ఈ మూడు కలర్లు దోమలకు ఇష్టమైన రంగులు. వీటిని దోమ ఎక్కువగా ఎట్ట్రాక్ట్ అవుతాయి. అయితే దోమలు వైట్, గ్రీన్, బ్లూని ఎక్కువగా గుర్తించలేవు. అందుకే ఈ కలర్ డ్రెస్ వేసుకుంటే దోమలు తక్కువగా కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే డార్క్ కలర్ ను దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. లైట్ కలర్స్ ను దోమలు తక్కువగా ఆకర్షిస్తాయని మరో పరిశోధనలో తేలింది.