వారంలో ఆరోజే ఎక్కువ మందికి గుండెపోటు వస్తుందట – కారణం ఇదే

Most people get a heart attack this day of the week

0
93

ఇదేంటి మనషికి ఎప్పుడు గుండెపోటు వస్తుందో చెప్పలేము. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి సంతోషంగా ఉన్న వ్యక్తి తన పని తాను చేసుకున్న వ్యక్తి గుండెపోటు వచ్చి పడిపోవడం చాలా సార్లు చూశాం. అయితే వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు.గుండెపోటు రావడానికి ముందే అనేక సంకేతాలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు . అతిగా ఆందోళన ఒత్తిడికి గురి అవ్వడం, మానసిక వేదనకి గురి అవ్వడం చేయకూడదు.

ఇలా ఉంటే గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారంలో ఎక్కువగా సోమవారమే ఎక్కువ మందికి గుండెపోటు వస్తుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి కారణం కూడా చెప్పారు అంతే కాదు పెద్ద ఎత్తున రీసెర్చ్ చేశారు. సుమారు
లక్షా 56 వేల మందిపై రీసెర్చ్ చేశారు. వారం మొదటి రోజు ఎంతో ఒత్తిడి ఉంటుందట. చాలామందిలో ఇది కనిపిస్తుందట.

సోమవారం అనేది ఆఫీసులు వ్యాపారాలు కర్మాగారాలు అన్నీ ఓపెన్ చేస్తారు. వీకెండ్ తర్వాత రోజు అయితే ఆరోజు పని వల్ల టార్గెట్ వల్ల ఈ ఒత్తిడి ఉంటుందట. అయితే ఇది ఓ కారణం అయితే కొందరికి శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, బీపీ ఎక్కువగా ఉండటం, ఊబకాయం, మధుమేహం కూడా గుండెపోటుకు ప్రధానా కారణాలు.