ఈ ప్ర‌పంచంలో వెల కట్టలేనిది తల్లిప్రేమ ఈ వీడియో చూడండి

Mother love is priceless in this world

0
110

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ‌ను మించిన ప్రేమ ఎవ‌రూ చూపించ‌లేరు. బిడ్డ‌లు ఎలాంటి వారైనా, పేరెంట్స్ ని చూడ‌క‌పోయినా త‌ల్లి మాత్రం త‌న పిల్ల‌ల‌పై ఎంతో ప్రేమ చూపిస్తుంది. మ‌నుషులే కాదు జంతువులు కూడా త‌మ పిల్ల‌ల‌పై ఇంతే ప్రేమ చూపిస్తాయి. ఈ ప్ర‌పంచంలో వెల కట్టలేనిది తల్లిప్రేమ.
తన పిల్లలు ఆపదలో ఉంటే ఏ తల్లి భ‌రించలేదు.

ఇక్క‌డ ఓ కోతి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఆపదలో ఉన్న తన బిడ్డను ఈ కోతి కాపాడుకుంది. అయితే ఆ కోతి ఓ సాహ‌సం చేసి త‌న బిడ్డ‌ను కాపాడుకుంది. ఆ వీడియో ఇప్పుడు పెను వైర‌ల్ అవుతోంది. ఒక కోతి పిల్ల విద్యుత్ వైర్‌పై వేలాడుతుంది. కాని బిల్డింగ్ కు దూరంగా వైర్లు ఉండ‌టంతో ఆ కోతి పిల్ల అక్క‌డ నుంచి దూక‌డానికి క‌ష్ట‌మైంది.

అయితే బరువు ఎక్కువగా ఉంటే విద్యుత్ ప్రసరణ జరిగి షాక్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ స‌మ‌యంలో త‌ల్లి కోతి అక్క‌డ‌కు వ‌చ్చి త‌న ప్రాణాల‌ను ప‌ట్టించుకోకుండా త‌న పిల్ల‌ని కాపాడుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మీరు ఈ లింక్ లో ఈ వీడియో చూడ‌వ‌చ్చు. ఈ వీడియో చూసిన అంద‌రూ త‌ల్లి ప్రేమ గురించి కామెంట్ చేస్తున్నారు.

వీడియో
https://twitter.com/rupin1992/status/1421456989880688644