రాజ్మా ఇప్పటి వారు పెద్దగా దీనిని తినడం లేదు.. కాని ఇది చాలా మంచి పోషకాహారం అనే చెప్పాలి, పోషకాహార భోజనంలో ఉండాల్సిన పదార్థాలలో దీనిని కచ్చితంగా తీసుకోవాలి , ఇప్పటికీ వీటి కర్రీచాలా హోటల్స్ లో ఫేమస్.. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. మన సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియన్స్ ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు.
పప్పుదినుసులలో రాజ్మా ఒకటి. శరీరానికి ఇది మంచి శక్తిని ఇస్తుంది, అలాగే కండర నిర్మాణం బాగుంటుంది, ఇక ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. ఇది పీచు పదార్ధం కాబట్టి ఇందులో ఎలాంటి చెడు ఫ్యాట్ కొలెస్ట్రాల్ రావు, ఇక వీటిని తింటే జీర్ణ సమస్యలు రావు.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పీచుపదార్థాల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా అన్పించి తక్కువ ఆహారం తీసుకొనేలా చేస్తుంది. ముఖ్యంగా వీటిలో ఫెనోలిక్ యాసిడ్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక షుగర్ పేషెంట్లు బీపీ ఉన్నవారు గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు, కిడ్నీ సమస్యలు ఉన్న వారు మాత్రం కాస్త దీనికి దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు.