అవిసె గింజలు ఈమధ్య చాలా మంది వీటిని తినడం వల్ల వీటి గురించి బాగా తెలుస్తోంది, అయితే గతంలో ఇవి బాగా తినేవారు.. ఈ మధ్య మళ్లీ తినడం ప్రారంభిస్తున్నారు, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అంతేకాదు రోజు ఒక్క స్పూన్ తీసుకున్నా చాలా మంచిది.
ఇవి తింటే ముందు రోజుల్లో కాస్త కష్టంగా అనిపిస్తుంది కాని తింటూ ఉంటే అలవాటు అవుతుంది, అయితే
ఈ గింజలు తింటే జుట్టు రాలే సమస్య ఉండదు..ఈ గింజలను శుభ్రం చేసి కాస్త వేయించి పొడి చేసుకుంటే మజ్జిగలో కానీ లేదా కారప్పొడి రూపంలో చేసుకుని కానీ తీసుకోవచ్చు.
అధిక పొట్ట కొవ్వు భారీకాయంతో ఉన్నవారు వీటిని తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు, పోషకాలు బాగా అందుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం లేకుండా కాపాడుతుంది,.ఈ గింజలు మహిళలు ఎదుర్కునే మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తాయి. నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తుంది. అందుకే మహిళలు వీటిని రోజు ఓ స్పూన్ తీసుకున్నా మంచిదే.