కమలాఫలాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని వైద్యులు చెబుతారు, ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉంటుంది అధిక పీచు పదార్దం ఉంటుంది, సో దీని వల్ల బరువు పెరగరు అలాగే నీరసం అనే సమస్య ఉండదు.
జలుబు, జ్వరాలకు కమలా పండ్లు మంచి ఔషదం. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడితే వారు ఈ కమలాలు తీసుకోవచ్చు రోజుకి ఒక కమలా తీసుకుంటే హ్యాపీగా ఉండచ్చు.
పిల్లలకు తరచూ జలుబు చేస్తున్నా పెద్దలకు కూడా సీజన్ లో జలుబు వస్తున్నా కమలాలు ఇవ్వండి ఇది చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాదు.ఇక కడుపుతో ఉన్న గర్భిణీలు వీటిని తీసుకోవడం మంచిది.
గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ కమలాల్లో ఉంటుంది. ఇవి తింటే గుండె జబ్బులు రావు, ఇక బీపీ సమస్య ఉండదు, చక్కెర స్ధాయిలు సమానంగానే ఉంటాయి. ఇవి తింటే తెల్లరక్తక ణాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎముకలు బలంగా మారడానికి తగిన కాల్షియం అందుతుంది కమలాల నుంచి… ఇక అల్సర్లు రాకుండా కాపాడతాయి ఇవి… అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్యలు రాకుండా చూస్తాయి.