రేగిపండు ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది.. ఈ పళ్లు రుచిలో సూపర్ అనే చెప్పాలి…కండరాలు, నాడీవ్యవస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి…ఈ పండు తియ్యగా వగరుగా ఉంటుంది ఇక విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి..ఇందులో విటమిన్ ఎ,సి లు ఇతర ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్లు ఎక్కువగా ఉంటాయి…అందుకే ఎలాంటి గుండె జబ్బులు రావు, ఇక రక్తిహీనత తగ్గుతుంది, రక్తప్రసరణ మెరుగు అవుతుంది… శరీర కణాలకు ఎలాటి నష్టం లేకుండా ఈ రేగి ఉపయోగపడుతుంది శరీరానికి.. ముఖం కాంతి వంతంగా ముసలి చర్మం ముడతలు లేకుండా కాపాడుతుంది.
మేనిచాయను మెరుగుపరిచి, మొటిమలు లేని అందమైన ముఖవర్ఛస్సును కలిగిస్తుంది..ఇక మీరు ఈ రేగిపండ్లు ఎండబెడితే ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్లు ఉంటాయి. మీకు ఎముకలు బలంగా మారుస్తాయి. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది, ఎముకల నొప్పులు కాళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తింటే మంచిది.