పుదీనా ఎక్కడైనా ఉంది అంటే దాదాపు చుట్టుపక్కల అంతా స్మెల్ వస్తూనే ఉంటుంది… చాలా వంటల్లో పుదీనా వాడతారు.. చికెన్ మటన్ అలాగే రైస్ రైతా ఇలా అన్నింటిలో పుదీనా వాడతారు… ఇక పుదీనా పచ్చడికి వాడతారు.. ఇక జ్యూస్ గా కూడా తీసుకుంటారు… ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది… ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, అనేక మందులు తయారు చేస్తారు
మరి పుదీనా వల్ల మనకు కలిసి వచ్చేవి ఏమిటి అనేది చూద్దాం.
ఇంట్లో చెడు వాసనలు వస్తూ ఉంటే… డోర్లు మూసేసి వేడి నీటిలో ఆ పుదీనా ఆకులు వేసి ఉంచండి మీకు ఆ వాసన పోతుంది.
అలాగే మౌత్ ఫ్రెష్నర్గా పుదీనా ఆకులు చాలా మంచిది నోట్లో ఎలాంటి క్రిములు ఉండవు. ఏదైనా వాంతి లేదా వికారం అనిపిస్తే పుదీనా ఆకులు వాసన చూసినా రెండు నమిలినా తగ్గిపోతుంది.
దగ్గుతగ్గాలి అంటే పుదీనా తింటే మేలు…జలుబుతో ముక్కు కారుతూ ఉంటే… పుదీనా ఆకుల రసం తాగినా మంచిదే. పుదీనా అప్పుడప్పుడూ తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి, మలబద్దకం ఉండదు.